Wednesday, February 15, 2017

Happy Valentine's Day


Wednesday, March 12, 2014

మౌన రాగం



తిరిగిరాని నా కంటి వెలుగు, నీ కళ్ళలో కలగా మారినా...
కాలంలో కలిసిపోయిన నా చిరునవ్వు, నీ పెదవులపై చిగురించినా...
లెక్కలేనన్ని రోజులు నీ ఆలోచనలలో కరిగిపోయినా...
రగిలిన ప్రేమ జ్వాల నా హృదయాన్ని దహించివేస్తున్నా..

నిస్వార్థంగా ప్రేమించానే కానీ, ఏనాడూ నీ ప్రేమను ఆశించలేదు.
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

ఒంటరిగా మన ప్రేమను గెలిపిస్తూనే ఉంటాను.




Wednesday, February 12, 2014

అనిర్వచనీయమైన “ప్రేమ”



ప్రపంచంలో ప్రతిదానికి ఓ నిర్వచనం ఉంటుంది.
కానీ  నిర్వచనం లేనిది ఏదైనా వుంది అంటే అది ప్రేమే.

ఆమె అతనిలో స్వరపరచిన సంగీతం గుండె చప్పుడై
ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తుంటే
ఆ అనుభూతిని ఆమెకు నిర్వచించాలని
అతడు చేసే ప్రయత్నమే.... ప్రేమ

అతడు ఆమెలో మ్రోగించిన కోటి వీణల
శ్రుతిలయలకు పరవసించి అతడి అడుగులకు 
అడుగులు జతకలిపి,
అతనిలో కలిసిపోయిన ఆమెకు
అతని సంతోషమే... ప్రేమ



Wednesday, January 15, 2014

హృదయాంజలి


తొలిసారి నా మనసులో మాటను, తన నోటితో చెప్తుంటే విన్నాను.

ప్రేమించడం అంటే జీవితాంతం ప్రేమించడం, అని తెలిసిన తనకి
తిరిగిరాని ప్రేమ కోసం ఆరాటపడటం దుఃఖాన్ని పెంచుతుందే కానీ,
తగ్గించదు అని తెలియదు.

తను ఎలా వున్నా పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు
తనలో ఆ ధీమా,
లైఫ్ లో ఇలా జీవించాలి అని
తను కన్న కలలు,
ఒక మగాడి నిశ్శబ్దం కింద నలిగిపోతుంటే..

నిన్ను బయటకు తీసుకుని రాలేక
నా స్నేహానికి నిన్ను సంతోషపెట్టే బలం ఉన్నా,
నీ బాధను దూరం చేసే శక్తి లేక

సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ... 
దూరంగా  నిలబడి ఆలోచిస్తూ కూర్చున్నాను. 




Saturday, November 16, 2013

The lost kite



నీ చేయిపట్టుకుని ఆకసవీధిలో స్వేచ్చగా ఎగిరాను,  
అందరికీ  ఆనందాన్ని పంచాను
నీ దగ్గరకు లాక్కున్నప్పుడల్లా
నీ ప్రేమకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను.
నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
మన బంధం తెగిపోయింది.

కారణం ఒక ప్రేమ ఇంకో ప్రేమకు అడ్డుపడటమే
తొలిసారిగా ఆరోజే తెలుసుకున్నాను.
ప్రేమే ప్రేమకు శత్రువు అని.
ఒక్కసారిగా ఒంటరినయ్యను,
చేసుకున్న బాసలు, మార్చుకున్న మనసులు, అనుబంధాలు, మమకారాలు, 
అన్ని తెగిపోయాయి.
బాధ అనే దూరాన్ని, కన్నీరు అనే సముద్రాన్ని దాటిన తరువాత
ఇక ఎగిరే ఓపిక లేక  కొద్ది నిమిషాలలో నేలకొరిగాను.
నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయాను.

గుండె ఎండిపోయింది, కన్నీళ్ళు ఇంకిపోయాయి,
చివరకు మిగిలింది నీపై ప్రేమే.....



Wednesday, November 6, 2013

కాబోయే శ్రీమతికి “ ప్రేమలేఖ ”



ప్రియమైన శ్రీమతికి,

నిన్ను చూడకుండానే.... నీ ప్రేమలో పడిపోయాను, అసలు నువ్వు ఎక్కడ ఉన్నవో తెలియదు,
ఎలా ఉంటావో తెలియదు, నా కళ్ళతో నిను చూడలేకపోవచ్చు, నీ మాటలు వినలేకపోవచ్చు,
నీస్పర్శను పొందలేకపోవచ్చు.



కానీ... ప్రతిక్షణం నిన్నే తలచుకుంటూ... నీ ఆలోచనలలో గడుపుతూ...  నీ కళ్ళల్లోకి చూసే
ఆ క్షణం కోసం.... అనుక్షణం తపిస్తున్నాను.  ఇది ప్రేమే కదా...
కానీ ఈ ప్రేమ మొదలుకాక ముందే... విరహాన్ని పరిచయం చేసావు.



నా కళ్ళు నీ కోసం ఎదురుచూస్తున్నాయి, అద్దం ముందు నన్ను నేను చూసుకుంటుంటే,
నా కళ్ళల్లో నువ్వు కనిపిస్తున్నావు... నిజం, నువ్వు ఎవరో ఇంకా తెలియకపోయినా....
నిరంతరం నా ఉహల్లో నువ్వే... నా శ్వాసలో సైలెన్స్ నువ్వు,  నా గుండె చప్పుడులో  రిథం నువ్వు,
నా నిద్ర లో కల నువ్వు,  ఇంకా చెప్పాలంటే నా ప్రాణం నువ్వు,

నీకోసం కనే కలలే ఇంత అద్భుతంగా ఉంటుంటే,    నా లైఫ్ లో నువ్వు...

నీ కోసం నిరీక్షణలో క్షణమొక యుగంలా గడుస్తుంది. హృదయమంతా నిండిన ఆ ప్రేమని,
ఒక్క చిన్న మాటతో నీకు చెప్పాలని... చిన్న ఊహతో మొదలైన నా ప్రేమ,
సముద్రమంత ప్రేమగా... మన ప్రేమగా మారాలనీ.... నా చిన్ని ఆశ.

ఎప్పుడు పూస్తుందో తెలియని గులాబి కోసం, ప్రతిరోజు ఎంతో ఆప్యాయంగా నీళ్ళు పోసి,
ఎలా పెంచుకుంటామో నా ప్రేమ కూడా అంతే...  భవిష్యత్తులో ఎర్రగులాబీ తోటలా విరబూసే
మన ప్రేమ కోసం,  ప్రేమతో నా ప్రేమను,  ప్రేమగా పంచుతున్నాను.

నీపై బెంగతో...  మా డాబాపై సన్నజాజితీగ చిక్కిపోయింది,
నా గులాబి మొక్క ఒక్క పువ్వు కూడా పూయడం లేదు,
పున్నమి రోజు చందమామ తొంగి తొంగి చూస్తున్నాడు, నువ్వు వచ్చావేమో అని...
సాగరానికి కోపం నిన్ను తీసుకుని రాలేదని, నా అడుగులను చెరిపేస్తున్నాడు...

ముళ్ళు గుచ్చుకుంటాయని తెలిసినా, గులాబిని పట్టుకుంటాము...
ఆ గులాబి ముళ్ళు గుచుకున్నప్పుడు వచ్చే తీయని బాదే.... ఈ ప్రేమలేఖ... 




 నీకోసం నిరీక్షిస్తూ...
                                                                    ప్రేమతో.... నీ రామ్